తెలంగాణలో థియేటర్లు తెరచి… కార్మికులను ఆదుకోండి- ప్రభుత్వాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ డిమాండ్

‘థియేటర్లను తెరవకపోవడం వల్ల తెలంగాణ లో డైరెక్ట్ గా.. ఇండైరెక్టుగా 50 వేల మంది థియేటర్ కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే థియేటర్లు తెరచి కార్మికులను ఆదుకోవాలని” ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. అప్పాయిట్ మెంట్ ఇస్తే నిర్మాతలు, సినీ కార్మికులు పడుతున్న బాధలను వివరిస్తానని విన్నవించారు. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఆ నాలుగురు నిర్మాతలే కాదని నట్టి కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. థియేటర్ లీజు ఓనర్లు… థియేటర్ల కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి… వారికి లీజు ఓనర్లు జీతాలిచ్చి ఆదుకునేలా ప్రభుత్వ పెద్దలు ఆదేశించాలని కోరారు. అలానే థియేటర్ల మెయింటైనెన్స్ చార్జీలు రూ.3 నుంచి రూ.7లకు పెంచేలా చూడాలన్నారు. గతంలో కూడా దీనిపై మీకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని వివరించారు. థియేటర్లు ఈ నెలలు నష్టాల్లో నడుస్తాయి కావున వచ్చే మార్చి వరకు GST లేకుండా చూడాలని కోరారు. చిన్న సినిమాల నిర్మాతలు సినిమా లను రిలీజ్ చేయడానికి రెడీగా వున్నారు. కావున తెలంగాణ లో వెంటనే థియేటర్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ కూడా ఇస్తే రెండు రాష్ట్రాల్లో ఒకే సారి విడుదల చేయడానికి వీలవుతుంది అన్నారు.