అమెజాన్ ప్రైమ్ లో నాని ‘V’.. రిలీజ్ ఎప్పుడంటే?

న్యాచురల్ స్టార్ నాని 25వ సినిమా V మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అనే వార్తలు గత కొన్ని వారాలుగా వైరల్ అవుతున్నాయి. ఇక వెయిట్ చేయడం ఎందుకని దిల్ రాజు ఫైనల్ గా అమెజాన్ తో డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

థియేటర్స్ కూడా ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా లేవు. ఓపెన్ అయినా కూడా గతంలో మాదిరిగా ఓపెనింగ్స్ అయితే రావు. అందుకే ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేసుకుంటే లాభాలు ఎక్కువగా రాకపోయినా నష్టాల భారిన పడకుండా ఉండవచ్చని దిల్ రాజు అమెజామ్ ప్రైమ్ తో 33కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమాను అమెజాన్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ చేసే ఆలోచనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.