నందమూరి బాల కృష్ణ తనయుడు మోక్షజ్ఞ తన యాక్టింగ్ ట్రైనింగ్ బాద్యతలు స్టార్-మేకర్ సత్యానంద్ కి అప్పగించారు

నందమూరి ఫాన్స్ కి ఓ గొప్ప శుభవార్త లభించింది. నందమూరి బాల కృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా అడుగుపెట్టడానికి బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం స్టార్-మేకర్ సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికి గత కొన్ని నెలలుగా మోక్షజ్ఞ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న విష్యం అందరికి తెలిసిందే. అయితే 400 యాక్టర్ లకు పైగా ట్రైనింగ్ ఇచ్చిన సత్యానందను బాలయ్య మోక్షజ్ఞకు ట్రైనింగ్ ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకున్నారు. వారిలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
గత నవంబర్ నుండి వైజాగ్ లో మోక్షజ్ఞ సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనియింగ్ తీసుకుంటున్నాడు. అయితే తన శరీరానికి సంబంధించి కూడా ట్రైనింగ్ తీసుకుంటునట్లు , దాని వల్ల కొంచం బరువు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. యాక్టింగ్ కోర్స్ అనేది ఒక విద్యార్థికి బేసిక్స్ నేర్పుతూ, ఒక నైపుణ్యం కలిగిన నటుడుగా మారుస్తుంది. సత్యానంద్ ట్రైనింగ్లో ఏం జరుగుతుంది అంటే ఒక నటుడుని కొంచం కొంచంగా ట్రైనింగ్ తో మారుస్తూ, కొన్ని నిజ జీవిత సత్యాలని పాఠాలుగా చెప్తూ ట్రైనింగ్ ఇవ్వడం తన ప్రత్యేకత అని సమాచారం.
సత్యానంద్ తన అచ్తింగ్ సిలబస్ ను రోజు రోజుకు అప్డేట్ చేస్తూ, ట్రెండింగ్లో ఉండటం వల్లనే స్టార్ ఆక్టర్స్ తమ పిల్లల్ని సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడానికి పంపుతారు అని అంటారు. అయితే నందమూరి ఫాన్స్ త్వరలోనే మోక్షజ్ఞను వెండి తెర మీద చూడనున్నారు.