యండమూరి గారు నా బయోగ్రఫీ రాయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది : మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ నవల రచయిత యండమూరి గారు తన జీవిత చరిత్రను రాయనున్నట్లు చిరంజీవి తెలిపారు. ఇటీవలే విశాఖపట్నం లో నిర్వహించిన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడే యండమూరి గారి రచాలను గుర్తు చేస్తూ 1980-90 కాలంలో వారి ప్రయాణం గురించి మాట్లాడినారు.
ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి, ఇంకా స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారి 10వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా అన్నారు, “యండమూరి లాంటి గొప్ప పేరు గాంచిన రచయిత నానా జీవిత చరిత్ర రాయడం నాకు గర్వంగా ఉంది.”
“యండమూరి గారు నా జీవిత చరిత్ర రాస్తాను అని చెప్పగానే నేను చాలా సంతోష పడ్డాను. ఇది సమగ్రంగా రావాలని నేను కోరుకుంటున్నాను.”