కొట్టాలన్నా ఆయనే, పెట్టాలన్నా ఆయనే

కొట్టాలన్నా మేమే, పెట్టాలన్నా మేమే… నందమూరి బాలకృష్ణ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ బాలయ్య నేచర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకే ఆయన ఎవరినైనా కొట్టినా న్యూస్ ఏ, ఎవరికైనా హెల్ప్ చేసినా న్యూస్ ఏ… కరోనా బాధితుల కోసం హీరోగా, బసవతారకం ఛైర్మెన్ గా తనవంతు సాయం అందిస్తున్న బాలకృష్ణ. తనని రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న హిందూపురం ప్రజల బాధ్యత కూడా తీసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నాడు. స్థానిక కోవిడ్ బాధితుల కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను హైదరాబాద్ నుంచి పంపించాడు. ఈ కోవెడ్ కిట్స్ ను స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద కోవెడ్ బాధితుల బంధువులకు తెదేపా నాయకులు అందజేశారు.