బాలయ్య ఇదేందయ్యా… ఇంత స్టైలిష్ గా తయారయ్యావ్!

మాస్ సినిమాలకి కెరాఫ్ అడ్రెస్ అయినా బాలకృష్ణని కేఎస్ రవికుమార్ అల్ట్రా స్టైలిష్ గా చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ కలయికలో వస్తున్న రెండో సినిమా రూలర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ చూసిన వాళ్ళు, ఈయన ఇన్ని రోజులు చూసిన బాలయ్య ఇతనేనా? ఇంత స్టైలిష్ గా ఉన్నాడేంటి అనే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. బాగా తగ్గి, ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ లుక్ ని పోలినట్లు డిజైన్ చేసిన బాలయ్య లుక్ నందమూరి అభిమానులు ఖుషి చేసింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

బాలయ్య, సోనాల్ చోహన్ మధ్య వచ్చే సాంగ్ నుంచి బయటకి వచ్చిన ఈ పోస్టర్ నెట్ లో వైరల్ అవుతోంది. స్లిమ్ లుక్ లో, స్టైలిష్ అవుట్ ఫిట్ తో బాలకృష్ణ కొత్తగా కనిపిస్తున్నాడు. రూలర్ సినిమాని డిసెంబర్ 20న అనౌన్స్ చేస్తున్నామని కన్ఫామ్ చేస్తూ ఈ పోస్టర్ బయటకి వచ్చింది. ఇదే డేట్ కి మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలయ్యది ఊరమాస్ సినిమా కాగా, తేజ్ ది కంప్లీట్ గా ఫ్యామిలీ మూవీ. మాస్ మహారాజ్ రవితేజ రేస్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు వార్ ప్రతి రోజు పండగే, రూలర్ సినిమాల మధ్య జరగనుంది.