‘బిగ్ బాస్’ తో పాటు ‘నాగ్’ సినిమా షూటింగ్.. డేరింగ్ డిసిషన్!!

టాలీవుడ్ మన్మథుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సినియర్ హీరో నాగార్జున కరోనా కాలంలో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. తన డేరింగ్ స్టెప్స్ తో అభిమానులను సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు. నెక్స్ట్ నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రోమోల కోసం షూటింగ్స్ లలో కూడా పాల్గొన్నారు. ఆదివారం ఆ షో స్టార్ట్ కానుంది.

ఇక నాగ్ అదే స్పీడ్ లో సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.
‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్న నాగ్ అత్యంత జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నాడు. క్రిమిసంహారక టన్నెల్స్, PPE కిట్లు మరియు ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ లతో దాదాపు 50 మంది కంటే సభ్యులతోనే షూటింగ్ పనులను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీతో సహా పలు లొకేషన్స్ లలో కూడా ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఆరు పదుల వయసులో కరోనా కాలంలో నాగార్జున తీసుకున్న డేరింగ్ స్టెప్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.