‘పవన్ కళ్యాణ్’ కోబలి మళ్ళీ సెట్స్ పైకి..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి అనుకున్నట్లుగానే పుట్టినరోజున అద్భుతమైన అప్డేట్స్ వచ్చేలా చేశారు. ఆయన నుంచి సినిమాలు వస్తాయో రావో అనుకుంటున్నా తరుణంలో వరుసగా నాలుగు ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ అనంతరం. పవన్ కళ్యాణ్ డిఫరెంట్ దర్శకులతో కలవబోతున్నారు.

క్రిష్, హరీష్ శంకర్ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ ఇక తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమా చేసే ఛాన్స్ ఉందట. గతంలో వీరిద్దరూ కోబలి అనే ఒక సినిమాను ఎనౌన్స్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ సినిమా కథ పూర్తిగ ఫ్యాక్షన్ డ్రాప్.లోనుంటుందట. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ ఆ కథపై కూర్చున్న త్రివిక్రమ్ మళ్ళీ కొత్తగా మారుస్తున్నాడట. త్వరలోనే కోబలి కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా పవన్ భీష్మ దర్శకుడు వెంకీతో పాటు కిషోర్ పార్థసానితో కూడా మరోసారి వర్క్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం