హాలీవుడ్ స్టార్స్ ది ‘రాక్’, ‘రాబర్ట్’ ప్యాటిన్సన్ కి కరోనా పాజిటివ్!!

హాలీవుడ్ స్టార్స్ రాబర్ట్ ప్యాటిన్సన్ మరియు డ్వేయిన్ జాన్సన్ కూడా కొరోనావైరస్ భారిన పడ్డారు. గత కొంత కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సినీ సెలబ్రెటీలను కూడా వదలడం లేదు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న హాలీవుడ్ స్టార్స్ డ్వేయిన్ ‘రాక్’ జాన్సన్, అతని భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కూడా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని చివరికి విజయాన్ని సాధించారు.

3 వారాల క్రితమే రాక్ ఫ్యామిలీలో కరోనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాబర్ట్ ప్యాటిన్సన్ కి కూడా కూడా కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ అని తెలడంతో అందరూ షాక్ అయ్యారు, అతను లండన్లో బాట్మాన్ షూటింగ్ లో పాల్గొనగా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. రాబర్ట్ ప్యాటిన్సన్ కరోనా రోగనిర్ధారణ తర్వాత వెంటనే క్వారంటైలోకి వెళ్లిపోయారు. ఇక బాట్మాన్ యొక్క షూటింగ్ ని కూడా నిలిపివేసి చిత్ర యూనిట్ కూడా క్వారంటైన్ లోకి వెళ్లింది. మరోవైపు, డ్వేయిన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బుధవారం వీడియో వీడియోను రిలీజ్ చేశారు, అతని భార్య లారెన్ మరియు ఇద్దరు కుమార్తెలు జాస్మిన్ మరియు టియానా కోవిడ్-19 నుంచి కోలుకోవడానికి గత మూడు వారాలు నుంచి తీవ్రంగా పోరాడుతున్నారని ఇక చివరికి తాము గెలిచామని డ్వేయిన్ జాన్సన్ తెలిపారు.