Nagarjuna: బంగార్రాజుగా కింగ్ నాగార్జున‌.. మ‌రోసారి బంగార్రాణిగా ప్ర‌ముఖ న‌టి..

Nagarjuna: అక్కినేని నాగార్జున న‌టించిన ప్ర‌స్తుత చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవ‌లే పూర్త‌వ్వ‌గా.. ఈ సినిమాలో నాగ్ ఎన్ఏ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో Nagarjuna నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఏసీపీ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంతో అహిషోర్ సోల్‌మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఈ సినిమాను నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తుండ‌గా..

nag-ramyakrishna

త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా త‌ర్వాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయ‌నా సీక్వెల్‌గా వ‌స్తున్న బంగార్రాజు చిత్రంలో న‌టించ‌నున్నారు. ఈ సినిమా క‌ల్యాన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటుండ‌గా.. ఈ చిత్ర షూటింగ్‌ను ఈ నెల రెండ‌వ వారంలో హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో Nagarjuna నాగార్జున స‌ర‌స‌న బంగార్రాణి ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర పోషించ‌నుంది. అలాగే నాగార్జున బాలీవుడ్ మూవీ బ్ర‌హ్మాస్త్రలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్ వీరితో పాటు బిగ్ బి అమితాబ్‌బ‌చ్చ‌న్ కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర‌లో పోషించ‌నున్నారు. దీంట్లో నాగార్జున ఆర్కియాల‌జిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు Nagarjuna.