వారిద్దరిని కొట్టి తప్పు చేశా

మెగా బ్రదర్ నాగబాబు ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేయడంతో పాటు మరోవైపు వెండితెరపై పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎప్పుడూ వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉండే నాగబాబు.. తాజాగా తన కుమారుడు హీరో వరుణ్ తేజ్, కూతురు నిహారిక గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. వాళ్ల చిన్నతనంలో జరిగిన విషయాలు గురించి తాజాగా వెల్లడించాడు.

nagababu

చిన్నప్పుడు వరుణ్ తేజ్, నిహారిక ఏదైనా తప్పు చేస్తే తిట్టడం కొట్టడం లాంటివి చేసేవాడిని అని, వారిద్దరిని ఒకటి, రెండుసార్లు కొట్టానని చెప్పుకొచ్చాడు. అయితే పిల్లలను కొట్టకూడదని, అది తాను చేసిన తప్పు అని నాగబాబు చెప్పాడు. ఆ టైమ్‌లో తనకు మెచ్యూరిటీ లేక అలా చేశానన్నాడు. తాను పిల్లలకు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. మీరు మొదట తల్లిదండ్రులతో ఫ్రీగా మాట్లాడండి. పేరెంట్స్‌తో అన్నీ షేర్ చేసుకోండి అని సూచించాడు.

‘నేను గొప్ప కమ్యూనికేటర్‌ని కాకపోవచ్చు గానీ ఎంతో కొంత బెటర్ అని నా ఫీలింగ్. నా పిల్లలు నిహారిక వరుణ్‌లకు చాలా విషయాలు చెప్పేవాడిని’ అని చెప్పాడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో వరుణ్ సినిమాల్లోకి వస్తా అంటే వెంటనే సరే అనేశాను. ఒకవేళ నటుడిగా సక్సెస్ కాకపోతే డిజప్పాయింట్ కావొద్దని చెప్పాను. నువ్ ఎలా ఉన్నా సరే యూ ఆర్ మై సన్. అదే విధంగా నిహారికకు చెప్పానని నాగబాబు తాజాగా వెల్లడించాడు.