పుట్టు చికెన్ కూర వండిన హీరోయిన్ రష్మిక

మెగా కోడలు ఉపాసన స్టార్ట్ చేసిన ‘యువర్ లైఫ్’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించింది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక గెస్ట్ ఎడిటర్‌గా ఉంటూ పలు రకాల వీడియోలు చేస్తోంది. హెల్త్ గురించి తను ఏం ఫాలో అవుతుందో ఆడియన్స్ కు చెబుతూ, ఆరోగ్యకరమైన రెసిపీలను వండుతూ తన స్టైల్లో ఎంటర్ టైన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

rashmika mandanna

అందులో భాగంగా తాజాగా చికెన్ తో ‘కోలీ పుట్టు’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది రష్మిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన ఆమెపై ప్రశంసలు కురిపించింది. హీరోయిన్‌గానే కాకుండా చెఫ్‌గా కూడా రష్మిక రాణిస్తుందంటూ ఉపాసన చెప్పింది.

రష్మికకు ఇంకా పెళ్లి కాలేదనీ, మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే రష్మిక మంచి ఆప్షన్ అని ఉపాసన చెప్పింది. ఇలా రష్మిక, ఉపాసన మధ్య చాలా ఆసక్తికర సంభాషణలు జరిగాయి. కాగా ప్రస్తుతం బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తమిళంలో కూడా పలు సినిమాల్లో రష్మిక నటిస్తోంది.