‘RRR’ కథ బయటపడింది

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. చలిలో షూటింగ్ చేస్తున్న ఫొటోలను ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే విడుదలైన రాంచరణ్, ఎన్టీఆర్‌ పాత్రలకు సంబంధించిన టీజర్లు ప్రేక్షకులకు అలరించాయి.

RRR

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించనుండగా.. కొమురం భీం పాత్రను తారక్ పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బ్రిటీష్ వాళ్ల తరపున పోలీస్ అధికారిగా విధ్యాధికుడు అయిన సీతారామరాజు పని చేస్తుంటారట. ఒక సందర్భంలో మాస్ లీడర్ అయిన గిరిజన నాయకుడు భీమ్‌ని అరెస్ట్ చేస్తారట. ఆ తర్వాత బ్రిటీషర్లకు పోరాడేందుకు వీరిద్దరు కలుస్తారట.

ఇప్పటికే లీకైన ఫొటోలు, టీజర్లు ఆథారంగా నెటిజన్లు ఈ కథను ఊహించి రాశారని తెలుస్తోంది. మరి ఈ కథ నిజమేనా?.. లేక అవాస్తవమా? అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.