పెళ్లైన హీరోతో ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్

సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ సినిమా విజయం సాధించకపోయినా.. అందులో నభా నటేష్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత రామ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్ హిట్‌ను అందుకుంది. ఆ సినిమాతో రామ్ పక్కన తన నటనతో నభా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. ఆ సినిమా ఫ్లాప్ అయింది.

naba natesh

అయితే పెళ్లైన ఒక హీరోతో ప్రేమలో పడ్డానని చెబుతోంది నభా నటేష్. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌తో తాను ప్రేమలో పడ్డానని, సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన అంటే తనకు చాలా ఇష్టమని ఈమె చెబుతోంది. చిన్నప్పటి నుంచి షారూఖ్ ఖాన్ తన ఫేవరేట్ హీరో అని, ఆయన నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమా ఎన్నిసార్లు చూసినా తనకు మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తుందని చెప్పింది.

ప్రస్తుతం సాయిథరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాల్లో నభా నటేష్ నటిస్తోంది.