Tollywood: అక్కినేని హీరోతో హాట్ బ్యూటీ న‌భా రొమాన్స్..

Tollywood: అక్కినేని నాగ‌చైత‌న్య, మ‌నం ఫేం డైరెక్ట‌ర్ విక్ర‌మ్‌. కె.కుమార్ కాంబినేష‌న్‌లో థ్యాంక్ యూ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో చైతూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు డైహార్ట్ ఫ్యాన్‌గా హ‌ల్‌చ‌ల్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రచ్చ చేశాయి. ఇక తాజాగా మ‌రో వార్తా చ‌క్క‌ర్లు కొడుతుంది.

Thank u movie

ఇందులో చైతూ స‌ర‌స‌న ఇస్మార్ట్ హాట్ బ్యూటీ న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టించ‌నున్నార‌ని వార్తాలోస్తున్నాయి. ఈ విష‌యాన్ని Tollywood చిత్ర‌బృందం అధికారికంగా వెలువ‌డించ‌లేదు. ఇక ఈ Tollywood చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఇక ఈ సినిమాకు బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందించ‌గా..పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు.‌