తమ విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య Xలో స్పందించారు. ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా, తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్నే రీట్వీట్ చేశారు. అటు సురేఖ కామెంట్స్పై సమంత సైతం కాస్త ఘాటుగానే స్పందించారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున ట్వీట్లో పేర్కొన్నారు.