మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగచైతన్య

సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు సౌత్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఇంకా ఎక్కువగా ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉండే మహేష్ బాబు వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడతారు. టాలీవుడ్‌లోని మిగతా హీరోలందరూ మహేష్‌ బాబు వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. గత ఏడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్.. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్నాడు.

NAGA CHAITANYA MAHESH FAN

కానీ మహేష్‌ అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగచైతన్య ఏంటీ అని అనుకుంటున్నారా?.. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం నాగచైతన్య థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అబిడ్స్‌లోరి రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలో నాగచైతన్య ప్రిన్స్ మహేష్‌బాబుకు పెద్ద అభిమానిగా ఉండటం వల్ల ఈ సినిమాలో మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కనిపించనున్నాడు. షూటింగ్ సందర్భంగా సినిమాలోని నాగచైతన్య పేరు అయిన అభిరామ్ పేరిట మహేష్ బాబు పోస్టర్లతో బ్యానర్లను ఏర్పాటు చేశారు.