భర్త ఆ పని చేసినందుకు విడాకులిచ్చిన నటి

హాలీవుడ్ నటి కిమ్ కర్దషియాన్ ఎప్పుడు ఏదోక వార్తతో వివాదంలో ఉంటుంది. తాజాగా మరో వార్తతో ఆమె వార్తల్లోకి వచ్చింది. గత ఏడేళ్లుగా భర్త కాన్సె వెస్ట్‌తో ఈ అమ్మడు కాపురం చేస్తోంది. కొన్నేళ్లుగా బాగానే కలిసి ఉన్నారు. కానీ అమెరికా ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా న్యె.. కిమ్‌తో పాటు ఆమె తల్లిదండ్రుల మీద విమర్శలకు దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయి.

kim kardashian divorce

ఈ క్రమంలో భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఈ అమ్మడు రెడీ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరు దూరంగానే ఉంటున్నారు. తాజాగా బంధానికి స్వస్తి చెప్పి అధికారికంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

హాలీవుడ్‌లో కిమ్ కర్షషియాన్ చాలా పాపులర్. తరచూ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు.