అడ్వకేట్ అయిన స్టార్ హీరోయిన్

ఒకప్పుడు సినిమా ఇండస్ట్ర అంటే చులకన భావన ఉండేది. చదువులేని వాళ్లు ఈ ఫీల్డ్‌లోకి వస్తారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్, MBA లాంటి మాస్టర్ డిగ్రీలు చేసిన వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దర్శకులు, నిర్మాతలు, యాక్టర్లుగా మారుతున్నారు. ఇక కొంతమంది అయితే సినిమాల్లో యాక్ట్ చేస్తూనే చదువుకుంటున్నాయి. సాయిపల్లవి ఇటీవల నర్స్‌కి సంబంధించిన పరీక్ష రాసిన విషయం తెలిసిందే.

MALAVIKA SHARMA ADVOCATE

తాజాగా రెడ్ హీరోయిన్ మాళవిక శర్మ అడ్వకేట్ అయింది. మాళవిక ఎల్‌ఎల్బీ చదివి లాయర్ పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్‌లో ఆమె మెంబర్‌షిప్ సంపాదించింది. దీనిని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.