చిరు ‘లూసిఫర్’ మ్యూజిక్ సిట్టింగ్స్ షురు చేసిన తమన్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్టర్ గా తెరకెక్కనున్న సినిమా లూసిఫర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకి ఇది రిమేక్ వెర్షన్. పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమాకి “చిరు 153” వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. ఆచార్య తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు తమన్.

Chiru 153: movie SS thaman music director confirmed

తమన్, దర్శకుడు మోహన్ రాజా కలిసి మేం “చిరు 153” మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాం… మెగాస్టార్ చిరంజీవి పై తన ప్రేమని చూపించు అవకాశం వచ్చిందని తెలిపుతూ… ఖచ్చితంగా మీ అందరిని ఆకర్షించే నా ఈ సినిమా సంగీతం ఉంటుందని ట్వీట్ చేశాడు తమన్. చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ మ్యూజిక్ “చిరు 153”కి మంచి ఎస్సెట్ అయ్యే అవకాశం ఉంది.