Pan Movie: ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ మరియు మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం మడ్డీ
. ఇంతకముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠ రేపే లా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ‘మడ్డీ’ తెలుగు టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిబ్రవరి 26న సాయంత్రం 6:03 కి విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. Pan Movie’మడ్డీ’ టీజర్ రెసీ గా ఉంది. ముఖ్యంగా రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కె జీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి.
ఈ టీజర్ చూస్తుంటే మడ్డీ చిత్రం ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్ కి తీసుకెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజర్ తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు ప్రగభల్ కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ Pan Movieసినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేయడం విశేషం. రియల్ స్టంట్స్ తో, ఎంతో రీసెర్చ్ తో వినూత్నంగా తెరకెక్కిన మడ్డీ టీజర్ లో చిత్ర బృందం పడిన కష్టం తెలుస్తోంది. తొలిసారిగా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఖరీదైన జీప్స్ ను మడ్ రేసింగ్ కి అనుగుణంగా మార్చి, మూడు విభిన్న తరహా మడ్ రేసింగ్ లతో మడ్డీ చిత్రాన్ని డిజైన్ చేశారు. బ్రెత్ టేకింగ్ టీజర్ తో ట్రైలర్ కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి. సమ్మర్ లో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అడ్వెంచరస్ ప్యాన్ ఇండియా మూవీ మడ్డీ టీజర్ ను ఇతర భాషల్లో అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమర్ రిలీజ్ చేశారు. యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ Pan Movieచిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్, రెంజీ పానికర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.