ప్రస్తుత సినిమా ఇండస్ట్రీ ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అసలు సినిమా థియేటర్స్ ఉంటాయా ఉండవా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఈ విషయంపై ఐ అండ్ బి సమావేశంలో కార్యదర్శి అమిత్ ఖరే ఒక వివరణ ఇచ్చారు.
ఆగస్టు 1 నాటికి సినిమా హాల్స్ భారతదేశం అంతటా తిరిగి తెరవడానికి అనుమతించవచ్చని సిఫారసు చేసినట్లు తెలిపారు. లేదా ఆగస్టు 31లోగా థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని వివరణ ఇచ్చారు. మొదటి వరుసలో ప్రత్యామ్నాయ సీట్లు మరియు తరువాత వరుసను ఖాళీగా ఉంచడం మరియు అంతటా ఈ పద్ధతిలో కొనసాగడం.. వంటి మార్పులతో థియేటర్స్ ని నడపాలని ఆదేషాలు రావచ్చని అన్నారు.
మంత్రిత్వ శాఖ సిఫారసు రెండు మీటర్ల సామాజిక దూర ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఖరే చెప్పారు, అయితే దానిని బదులుగా రెండు గజాలకు సున్నితంగా సర్దుబాటు చేస్తుందని హోం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి అనుమతులు రావాల్సి ఉందిని తెలియజేశారు. అయితే అలాంటి రూల్స్ పెడితే థియేటర్స్ నడిపించి నష్టాలు కోనితెచ్చుకోవడం కన్నా కూడా వాటిని మూసివేయడం బెటర్ అని సినిమా థియేటర్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.