Tollywood: డైరెక్టర్ సెల్వకన్నన్ తెరకెక్కించిన మొగల్తూరు చిత్రం సంక్రాంతి కానుకగా OTT platforms లో విడుదల అయ్యింది. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఒక చక్కటి కుటుంబ ప్రేమ కథా చిత్రం. కథే ఈ సినిమాకు ప్రధాన హీరో. ఒక సామన్య కుటుంబంలో తల్లిదండ్రులకు కొడుకు, కూతుర్లపై ఉండే ప్రేమ, వారి పిల్లలపై ఆప్యాయతలు, పిల్లలు కష్టాల్లో ఉన్నపుడు తల్లిదండ్రులు వారి బాగు కోసం పడే తపన ఈ సినిమాకు జీవం.
Tollywood కూతురికి కూడా కొడుకు తో పాటు సమానంగా ఆస్తిని పంచడం అనే అంశాన్ని ఈ చిత్రంలో అంతర్లీనంగా చూపించిన దర్శకుడి ప్రతిభను ప్రేక్షకులు మెచ్చుకోవాల్సిందే. ఈ చిత్రంలోని నటించిన వారందరూ.. వారి పాత్రలకు సమాన న్యాయం చేకుర్చారు. ఒక చిన్న సినిమాగా సంక్రాంతికి విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే సినిమాను మరో ఎత్తున వుంచే సంగీతం, దానికి తోడుగ కథలో ఒదిగిపోతూ సాగే చక్కని పాటలు, పల్లెటూరి వాతావరణంలో ఏ హంగులు లేకుండ, ఒక సగటు కుటుంబంలో ఉండే అన్ని పాత్రలు కథలో ఒదిగిపోయి ప్రేక్షకులను మొత్తంగా మైమరిపింప చేస్తాయి. స్వఛ్చమైన ప్రేమను చూపించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా.. ఒక కూతురి బాగు కోసం తండ్రి పడే తపనను ’ఆకాశమే నీ హద్దురా’ ఫేమ్ ’పూ రాము’ చేసిన నటన గుండెల్లో నిలిచిపోతుంది. ఇక ఈ చిత్రం ఇండియాలో MXplayer, AirtelXstream, Vodafone India and Hungama OTT platform lo విడుదల అయ్యి విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఆమెజాన్ ప్రైమ్‌లో యూకేలో, యూఎస్ఎలో ఈ చిత్రం ఆదరణ చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉందని Tollywood సనీషా క్రియేషన్స్ ఆనందం వ్యక్తం చేశారు.