Hollywood: ఆస్కార్‌పై క‌న్నేసిన ప్రియాంక‌చోప్రా..

Hollywood: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్క‌డే హాలీవుడ్ పాప్‌సింగ‌ర్ నిక్ ‌జోనాస్‌ను వివాహమాడింది మాజీ మిస్ వ‌ర‌ల్డ్‌. దీంతో లాస్ ఏంజిల్స్‌లోనే స్థిర‌ప‌డ్డ ప్రియాంక తాజాగా ఓ Hollywood హాలీవుడ్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కూడా పోషించింది. ఈ అమ్మ‌డు అమెరిక‌న్ టీవీ షోస్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది..

priyanka jonas

కాగా ఆమె న‌టించిన Hollywood వైట్ టైగ‌ర్ సినిమా నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ అయి.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక‌తో పాటు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ కూడా ఉన్నారు. ఇక ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో, విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. త‌న భ‌ర్త నిక్ జోనాస్ ఈ చిత్రం చూసి నా ప‌ర్ఫామెన్స్ చాలా బాగుంద‌ని కితాబిచ్చాడ‌ని.. మ‌న జోనాస్ ఫ్యామిలీలో తొలి ఆస్కార్ సాధించేది నువ్వే అని అన్నాడ‌ని తెలిపింది ప్రియాంక‌.. దీంతో సోష‌ల్ మీడియాలో వైట్ టైగ‌ర్ చిత్రం ఆస్కార్‌పై త‌న మ‌న‌స్సులో ఉన్న మాట‌ను ఇలా చెప్పుకోస్తుంది ప్రియాంక జోనాస్‌.