మీర్జాపూర్ సీజన్ 3 అప్డేట్

మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ దేశం లోనే మంచి ఆదరణ పొందింది. హిందీ లోనే కాకుండా అనేక భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కావడం జరిగింది. అమెజాన్ లో స్ట్రీమ్ అయినా ఈ వబ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుండి రెండు సీజన్లు విడుదల అయ్యాయి. ఆ రెండు సీజన్లు మంచి వ్యూస్ సాధించాయి. ఈ సిరీస్ ఆక్షన్ ఇంకా థ్రిల్లర్ జోనర్ లోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ నుండి అమెజాన్ ఓ కొత్త అప్డేట్ విడుదల చేసింది. సీజన్ 3 కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాలి అంటూ ఆ అప్డేట్ పేర్కొంది. అయితే సీజన్ 3 లో 1 & 2 మించిన ట్విస్టులు ఉండొచ్చని అంచనా. జూన్ లేదా జూలు లో ఈ 3వ రావచ్చని అనుకుంటున్నారు.