ఢీ ఫినాలే లో జబర్థస్త్ ఆది అనిల్ రావిపూడిని అలా అడగటం కరెక్టా?

బుల్లి తెరపై మనం చూసే ప్రోగ్రామ్స్ చాల ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యంగా కామెడీ షోస్, డాన్స్ షోస్ ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తారు. ఈ క్రమంలో ఢీ డాన్స్ షో ప్రధాన స్థాయిలో ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అందుకే కాబోలు ఢీ షో విజయవంతంగా ఇప్పటికే 16 సీజన్లు పూర్తి చేసుకుని 17వ సీజన్ ఫినాలే వరుకు చేరుకుంది. ఈ ఢీ ఫినాలే ఎపిసోడ్ కి ముఖ్య అతిధులుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హిరోయిన్ ప్రణిత ఇంకా జబర్థస్త్ ఆది వచ్చారు.

అయితే ఇటీవలే ఢీ ఫినాలే ప్రోమో విడుదల కావడం జరిగింది. ఆ ప్రోమోలో అనిల్ రావిపూడి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు అని చెప్పుకోవాలి. అలాగే ఫినాలే ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు వేసిన వేసిన డాన్స్ ప్రోమోలు చూపించడం జరిగింది. ఫైనల్ గా ఎవరు గెలిచారో చెప్పే సమయంలో ఆది అనిల్ రావిపూడి తో ఫన్నీ గా ఒక క్వెషన్ అడుగుతారు. అలా ఆ ప్రోమో ముగుస్తుంది. అయితే ఆ ఫినాలే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, అతిధులుగా వచ్చిన అనిల్ రావిపూడి, హిరోయిన్ ప్రణిత ఇంకా జబర్థస్త్ ఆది ఏం ఏం చేశారో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ఫినాలే లో ఎవరు గెలిచారు అనేది ఆ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే.