బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ న్యూడ్ ఫొటోషూట్ గతంలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. నవంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా గోవా బీచ్‌లో మిలింద్ న్యూడ్‌గా హల్చల్ చేశాడు. ఒంటిపై అసలు బట్టలు లేకండా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడి భార్య అంకితా కొన్వర్ ఈ ఫొటోలు తీసింది. ఒక సెలబ్రెటీ ఇలా న్యూడ్‌గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారింది.
దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ వివాదంపై మిలింద్ అసలు స్పందించలేదు. అయితే తాజాగా ఎట్టకేలకు దీనిపై నోరు విప్పాడు. కేసు నమోదు చేయడం గురించి తనకు ఏమీ తెలియదని, దీని గురించి ఎవరూ తనకు ఏమీ చెప్పలేదన్నాడు. పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నాడు. తాను చాలా సంవత్సరాలుగా న్యూడ్ ఫోటోషూట్ గురించి మాట్లాడుతున్నానని, తాను గతంలో కూడా అనేక న్యూడ్ ఫోటోషూట్లను చేశానన్నాడు.
ప్రజలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న ఫోటోలను పంచుకుంటారుని, ప్రతి ఒక్కరికీ వారి కలలు ఉన్నాయన్నాడు. తన ఫొటోలపై ఇంటర్నెట్లో వచ్చిన ట్రోల్స్‌పై కూడా మిలింద్ స్పందించాడు.ఇంటర్నెట్లో ట్రోల్స్ చేసేవాళ్లు నిజమైన మానవులు కాదన్నాడు.