Tollywood: కాబోయే భ‌ర్త‌తో మెహ్రీన్ తాజా ఫోటో వైర‌ల్‌.. మార్చి 12న నిశ్చితార్థం!

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదీ కృష్ణ‌గాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. త‌న బొద్దు బొద్దు అందాల‌తో కుర్ర‌కారును ఓ రేంజ్‌లో అల‌రించింది మెహ్రీన్‌.. ఎఫ్‌2, చాణక్య, మ‌హానుభావుడు వంటి చిత్రాలతో ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆమె కెరీర్‌లో ఎఫ్‌2 గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో హానీ పాత్ర‌లో అద‌ర‌గొట్టేసింది.. దీంతో Tollywood తెలుగు ప్రేక్ష‌కుల్లో హానీ అనే గుర్తింపును తెచ్చుకుంది.

Mehreen pirzda

ఇక ప్ర‌స్తుతం ఆమె ఎఫ్‌3లో న‌టిస్తుంది. కాగా మెహ్రీన్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. హ‌ర్యానా మాజీ సీఎం భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్యతో మెహ్నీన్ పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే మార్చి 12న వీరి ఎంగేజ్‌మెంట్ రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్ విల్లా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఎంగేజ్‌మెంట్ సంద‌ర్భంగా మెహ్రీన్ స్లిమ్‌గా త‌యార‌యింది. ఈ క్ర‌మంలో తాజాగా త‌న‌కు కాబోయే వాడితో ఓ ఫోటోను దిగి..సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది మెహ్రీన్‌. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది.