Tollywood: సినీ స్టార్స్ అప్పడప్పుడు తమ సన్నివేశాలను డూప్లతో కానిచ్చేస్తారు. ముఖ్యంగా రిస్కీ షాట్స్లలో డూప్‌లను పెట్టి చేయిస్తారు దర్శక నిర్మాతలు. కానీ ఈ రిస్కీ షాట్స్ల్లో డూప్‌గా చేసిన వారు తెర ముందు కనిపించరు. ప్రేక్షకులకు అసలు వీళ్లు ఎవరు అని కూడా గుర్తు పట్టరు. అయితే ఇప్పుడున్న కాలంలో కొన్ని Tollywood ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో వీరి గురించి సినీ ప్రేక్షకులకు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి డూప్‌గా ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి చేస్తారు.
ఈయన గురించి ఇటీవలే ఓ షో వాళ్లు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ ఈ షోలో చిరంజీవి డూప్‌గా వచ్చారు ప్రేమ్‌కుమార్. జిల్లాలోని పాలకొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్‌కుమార్ 30ఏళ్లుగా Tollywood చిరంజీవి డూప్‌గా చేస్తున్నారు. అంతేకాదు. రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయనకు ఒక కంపెనీ ఉంది. ఇక ఈ షోకు వచ్చిన సందర్భంలో ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. రికార్డింగ్ డ్యాన్సర్లంటే చాలా చిన్న చూపని, వారికి ఆదరణ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మా లాంటి వాళ్లను ఆదరిస్తున్నందుకు ఈ షో వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రేమ్‌కుమార్ అన్నారు.