చిరు 152కి కూడా సైరా బాటలోనే కొరటాల శివ…

సైరా సినిమాతో యుద్ధ వీరుడిగా కనిపించి తన చిరకాల కోరికని తీర్చుకున్న మెగాస్టార్మె చిరంజీవి, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ సినిమా అనే పదానికి మెసేజ్ జోడిస్తూ కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ, చిరుని ఈ సినిమాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిగా చూపిస్తూనే, నక్సల్ పాత్రలో కూడా చూపించబోతున్నాడని సమాచారం. 151 సినిమాల్లో చేయని క్యారెక్టర్ చేస్తున్న చిరు, త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఈ చిరు యంగ్ ఏజ్ పాత్రలో రామ్‌ చ‌ర‌ణ్ కనిపించనున్నాడనే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

chiru152

తాజా సమాచారం మేరకు ఈ సినిమా సంగీత సార‌థ్యం కోసం బాలీవుడ్ సంగీత ద్వ‌యం అజ‌య్‌-అతుల్‌ల‌తో నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. పీకే, జీరో, సూప‌ర్ 30 చిత్రాల‌కు సంగీతం అందించారు. వీరు మ‌రాఠీ సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ సైర‌ట్‌, తెలుగులో షాక్ చిత్రాల‌కు కూడా సంగీతాన్ని అందించారు. సైరా సినిమాకి కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నే పెట్టుకోవడంతో అదే దారిలో నడుస్తూ చిరు152కి హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొరటాల ప్రతి సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడు. ఇప్పుడు చిరు 152కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లైన్ లోకి వస్తే మొదటిసారి ఈ కాంబినేషన్ బ్రేక్ అయినట్లే.