నార్త్ ఇండియాలో ఉప్పెనలా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్

uppena

చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సొంత తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ చేస్తున్న సినిమా ఉప్పెన. క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. సుకుమార్‌ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ రోజు నుండి ఉప్పెన కొత్త షెడ్యూల్‌ను పూరితో పాటు కోల్‌కతా, గ్యాంగ్‌టక్‌ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. 20రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను షూట్‌ చేయనున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ పనులు ప్రారంభం కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శామ్‌ దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.