మ‌హేశ్‌తో మంచు విష్ణు.. కుర్రాడిలా ఉన్నాడ‌ని ట్వీట్‌!

టాలీవుడ్‌లో ఎవ‌ర్‌గ్రీన్ అంద‌గాడు ఎవ‌రు? అంటే ట‌క్కున గుర్తు వ‌చ్చే పేరు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు. న‌ల‌భై ఐదేళ్లు వ‌చ్చేసినా చెక్కు చెద‌ర‌ని అందంతో ఆడ‌వాళ్ల‌కి సైతం అసూయ పుట్టించేలా ఉంటాడు మ‌హేశ్‌. అయితే తాజాగా మ‌హేశ్ అందం గురించి హీరో మంచు విష్ణు స్పందించారు. ఇటీవ‌లే తాము క‌లిసి దిగిన ఫోటోను పంచుకున్న ఆయ‌న‌.. పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు. ఈ ఫోట‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు, న‌మ్ర‌త‌, మంచు విష్ణు, వెరానికా ఉన్నారు.

ఈ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన విష్ణు.. ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తి రోజురోజుకు అందంగా త‌యార‌వుతున్నాడ‌ని, మ‌రింత కుర్రాడిగా మారిపోతున్నాడ‌ని పేర్కొన్నారు. కాగా ఆయ‌న అలా క‌నిపించ‌డానికి అత‌డి మ‌న‌సు, సత్ర్ప‌వ‌ర్త‌నే కార‌ణ‌మ‌ని బ‌లంగా న‌మ్ముతున్నాన‌ని వివ‌రించాడు. దీనిపై మ‌హేశ్‌బాబు స్పందించారు.. గ‌త రాత్రి త‌మ‌కు ఎంతో గొప్ప‌గా ఆతిథ్యం ఇచ్చిన మంచు విష్ణు దంప‌తుల‌కు మ‌హేశ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.