రూ.100 కోట్ల మార్క్ దాటేసిన మాస్టర్ మూవీ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా మాస్టర్. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌కి తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో కూడా క్రేజ్ ఉంది. దీంతో విజయ్ సినిమాలకు అన్నిచోట్ల వసూళ్లు వస్తూ ఉంటాయి. అలాగే మాస్టర్ కూడా అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ సినిమాకు రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాగా.. ఒక తమిళనాడులోనే రూ.50 కోట్లు వచ్చాయి.

MASTER THREE DAYS COLLECTIONS

50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తున్న క్రమంలో ఇన్ని భారీ కలెక్షన్లు రావడం గ్రేట్ అని చెప్పుకోవాలి. విజయ్‌కు ఉన్న సత్తా ఏంటో దీనిని బట్టి తెలుస్తోంది. భారీ కలెక్షన్లు వస్తుండటంతో.. మాస్టర్ సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.