మాల్‌లో హీరోయిన్‌కి వేధింపులు

సినిమా ఛాన్సుల కోసం హీరోయిన్లను దర్శక, నిర్మాతల లైంగికంగా వేధించడం లాంటి ఘటనలు పలుమార్లు బయటపడ్డాయి. దీనిపై జరిగిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. మీటూ ఉద్యమంలో భాగంగా చాలామంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. ఇక హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. అభిమానులు వచ్చి పైన పడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక హీరోయిన్ బయట కనిపించగా.. ఇద్దరు వ్యక్తులు వేధించిన ఘటన బయటపడింది.

ANNABEN

‘కుంబలంగి నైట్స్’ సినిమాతో పాపులర్ అయిన మలయాళీ హీరోయిన్ అన్నాబెన్.. ఆ తర్వాత హెలెన్, కప్పేలా వంటి సినిమాల్లో నటించింది. తాజాగా సోదరితో కలిసి ఆమె షాపింగ్‌కు వెళ్లగా.. ఇద్దరు వ్యక్తులు వేధించారని ఈ అమ్మడు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఒకరు వెనుక నడుస్తూ తన బ్యాక్‌ను టచ్ చేస్తూ వెళ్లిపోయాడని చెప్పింది. అప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపింది.

మళ్లీ కూరగాయలు కొనేటప్పుడు తనను వచ్చి ఫాలో అయ్యారని చెప్పింది. వాళ్లు కావాలని ఇదంతా చేసినా తాను ఏం చేయలేకపోయానని ఈ అమ్మడు బాధపడింది. బయటికి వెళ్లిన ప్రతిసారి తనకు ఇలాంటికి ఎదురు అవుతున్నాయని, తన పరిస్థితి ఇలా ఉంటే మిగతా అమ్మాయిల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవాలని తెలిపింది. అమ్మాయిలకు ఇలాంటి సంఘటనలు ఎదురు అయినప్పుడు తనలాగా కాకుండా చెంప చెల్లుమనిపించాలని అన్నాబెన్ సలహా ఇస్తోంది.