చిన్నారులకు అండగా మహేష్

రీల్ కాదు.. రియల్ హీరో కూడా అనిపించుకుంటున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ఆపదలో ఉన్నవాళ్లకి తమ వంతు సహాయం అందిస్తున్నాడు. ముఖ్యంగా ఇతరత్రా రోగాలతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ బాబు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. కొద్ది సంవత్సరాలుగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో చిన్నారులకు హెల్త్ చెకప్‌లు మహేష్ బాబు చేయిస్తున్నాడు. ఎంతోమంది చిన్నారులకు హర్ట్ సర్జరీలు చేయించిన మహేష్ బాబు.. ఇప్పటివరకు 1010 మంది చిన్నారులకు ఆర్థిక సహాయం చేశాడు.

maheshbabu

తాజాగా ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారిని మహేష్ బాబు ఆదుకున్నాడు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మహేష్ బాబు ఆర్థిక సాయం చేసి సర్జరీ చేయించాడు. సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆ చిన్నారి కుటుంబానికి తాము అండగా ఉంటామని మహేష్ బాబు భార్య నమత్ర సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అనారోగ్యంతో బాధపడుతున్న చాలామంది చిన్నారులకు తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామని నమ్రత వెల్లడించారు. చిన్నారులకు ఆర్థిక సహాయం చేస్తున్న మహేష్ బాబు నిజంగా రియల్ హీరో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న సర్కారువారి పాట సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ సినిమా చేసే అవకాశముంది.