బాలయ్య సినిమాలో నందమూరి హీరో గెస్ట్ రోల్

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న BB3 సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనుండగా.. ఇద్దరు హీరోయిన్స్‌ను సినిమా యూనిట్ ఎంపిక చేసింది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ కావడంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

BALAYYA

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఇందులో నందమూరి కల్యాణ్ రామ్ గెస్ట్ రోల్‌లో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. కల్యాణ్ రామ్ పాత్ర ఇంటర్వెల్‌లో వస్తుందని, ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కల్యార్ రామ్ కనిపిస్తాడని చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

బాలయ్య సినిమాలో కల్యాణ్ రామ్ నటిస్తే నందమూరి అభిమానులకు ఇంక పండుగే. గతంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణతో కలిసి కల్యాణ్ రామ్ నటించాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇటీవలే BB3 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో బాలయ్య పాల్గొననున్నాడు. ఇప్పటికే విడుదలైన BB3 టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.