మ‌రో చిన్నారి ప్రాణం కాపాడిన‌ మ‌హేశ్‌..

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారుల గుండెల‌కు ఆయుష్షు పోసి దాతృత్వం చాటుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో చిన్నారి త‌ల్లిదండ్రుల చిరున‌వ్వుకు సూప‌ర్‌స్టార్ కార‌ణ‌మ‌య్యార‌ని న‌మ్ర‌త పేర్కొన్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 1020 మంది చిన్నారుల‌ను మ‌హేశ్ కాపాడాడు. ఆ కుటుంబాల ఫోటోల‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. షేక్ రిహాన్ అనే చిన్నారి ట్రయాల‌జీ హార్ట్ స‌ర్జ‌రీతో సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డింది. ఈ విష‌యంపై మ‌హేశ్ స్పందించారు.

ఆ చిన్నారి సేఫ్ అని తెలియ‌డంతో త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఆ చిన్నారి ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నాని అన్నారు. అలాగే ఆ చిన్నారికి వైద్యం చేసిన వైద్యుల‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు మ‌హేశ్‌. అదేవిధంగా.. రిహాన్ కోలుకున్న విష‌యం చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని.. రిహాన్ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తానంటూ న‌మ్ర‌తా త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మ‌హేశ్ స‌ర్కార్ వారి పాట‌లో న‌టిస్తుండ‌గా.. ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వంలో, ఇందులో క‌థానాయిక‌గా కీర్తి సురేశ్ న‌టిస్తోంది.