క్రాక్ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా జనవరి 9న విడుదల్వగా.. కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. సంక్రాంతి హిట్‌ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా లాభాల బాటలో నడుస్తోంది. ఈ సినిమాను మరో హిట్‌ను రవితేజ తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

krack release in aha

జనవరి చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా యాప్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఇప్పటికే డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. ఠాగూర్ మధు నిర్మించారు.