Maheshbabu: మ‌రోసారి సంక్రాంతి బరిలో (సర్కార్ వారి పాట‌తో)సూప‌ర్‌స్టార్..

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మహేశ్‌బాబు తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట‌. గీతాగోవిందం ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం రూపొందుతుండ‌గా.. జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మైత్రి మూవీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో Maheshbabu మహేశ్ స‌ర‌స‌న తొలిసారి కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తు‌తం ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేయ‌గా..

Maheshbabu మ‌హేశ్‌తో పాటు చిత్ర‌యూనిట్ అంతా దుబాయ్‌లో ఈ చిత్ర‌ షూటింగ్ జ‌రుపుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్‌.ఎస్. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.. ఈ చిత్రం కోసం Maheshbabu Maheshbabu మ‌హేశ్ అభిమానులు అంతా ఎప్పుడ‌ప్పుడా అని ఎదురుచూస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో స‌ర్కార్ వారి పాట మూవీ టీం నుంచి స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది(2022)లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఆ చిత్ర పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. దీంతో మ‌రోసారి Maheshbabu మ‌హేశ్‌బాబు సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి స‌న్న‌ద్దం అయ్యాడు. గ‌తేడాది 2020లో సంక్రాంతి కానుక‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.