ప్రముఖ సినీ నటుడు కన్నుమూత.. షాక్‌లో సినీ పరిశ్రమ

ప్రముఖ బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి తండ్రి అరవింద్ జోషి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో.. ఇవాళ ఉదయం మరణించారు. ఈ విషయాన్ని అరవింద్ జోషి మరదలు సరితా జోషి మీడియాకు వెల్లడించారు.

Actor Arvind Joshi passed away

అరవింద్ జోషి వయస్సు 84 సంవత్సరాలు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అరవింద్ జోషి కుమారులు శర్మాన్ జోషి, మాన్సి జోషి కూడా నటులే. బాలీవుడ్‌లో షోలో, లవ్ మ్యారేజ్, నామ్ సినిమాల్లో నటించారు. ఇక గుజరాతీలో గ‌ర్వో గ‌రాసియో, ఘెర్ ఘెర్ మ‌తినా చులా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. అరవింత్ జోషి మృతికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.