రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందే మహేష్ మరో ప్లాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ మార్కెట్ ని మరింత పెంచుకున్న సూపర్ స్టార్ నెక్స్ట్ కూడా అదే తరహాలో హిట్ అందుకోవడానికి సర్కారు వారి పాటతో రెడీ అవుతున్నాడు. ఆ సినిమా తరువాత రాజమౌళితో ఒక సినిమా చేయాలని కమిట్మెంట్ ఇచ్చాడు.

అయితే రాజమౌళి RRR పూర్తి చేసేవరకు కొంత ఎక్కువ సమయం పట్టేలా ఉందని తెలియడంతో మరో దర్శకుడిని లైన్ లో పెట్టాలని అబుకుంటున్నాడు. త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయాలి కాబట్టి అదేదో ఇప్పుడే చేసేస్తే అయిపోతుందని అనుకుంటున్నారట. అందుకోసం త్రివిక్రమ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ త్రివిక్రమ్ రామ్ తో ఒక చిన్న సినిమాను ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని వీలైనంత వరకు మహేష్ బాబు త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.