Superstar: ‘మ‌హ‌ర్షి’ చిత్రానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయి: మ‌హేశ్‌ బాబు

Superstar: 2019సంవ‌త్సారానికి గాను 67నేష‌న‌ల్ అవార్డ్స్ ఇటీవ‌లే కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ అవార్డుల్లో న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ చిత్రం ఉత్త‌మ చిత్రంగా పుర‌స్కారం ద‌క్కించుకుంది. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వ‌చ్చాయి.. ఉత్త‌మ తెలుగు చిత్రంతో పాటు జెర్సీ చిత్రానికి గానూ ఉత్త‌మ ఎడిట‌ర్‌గా న‌వీన్ నూలికి అవార్డు వ‌రించింది. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వ‌రించాయి.. ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం, ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్‌గా రాజు సుంద‌రం, ఉత్త‌మ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ ల‌పై వ‌రించాయి.

Maharshi

దీనిపై తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేశ్ బాబు స్పందిస్తూ.. మంచి సినిమా ఎప్ప‌టికీ విజేత‌గానే నిలుస్తుంద‌ని, అందుకు మ‌హ‌ర్షికి చిత్రానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని తాను భావిస్తున్న‌ట్లు అన్నారు. అలాగే ఇంత‌టి మంచి సినిమాను తీర్చిదిద్దిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్ల‌కి ధ‌న్య‌వాదాలు అని చెప్పుకొచ్చాడు మ‌హేశ్‌. ఇక మ‌హేశ్ ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ‌