మల్టీ డైమన్షన్స్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పిన ”మ్యాడ్” చిత్ర బృందం!!

మోదెల టాకీస్ పతాకంపై దర్శకుడు లక్ష్మణ్ మేనేని రూపొందించిన సినిమా ”మ్యాడ్”. లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెకక్కిన ఈ చిత్రంలో రజత్ రాఘవ్, స్పందన పల్లి, మాధవ్ చిలుకూరి, శ్వేత వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టి వేణు గోపాల్ రెడ్డి, బి కృష్ణా రెడ్డి మిత్రులు నిర్మాతలుగా వ్యవహరించారు. సమాచార లోపంతో నిర్మాతలు ”మ్యాడ్” సినిమా టైటిల్ రెన్యువల్ చేసుకోలేదు. ఈ టైటిల్ ను మల్టీ డైమన్షన్స్ సంస్థ రిజిస్టర్ చేయించుకుంది. అయితే ”మ్యాడ్” సినిమా టైటిల్ తో తాము ఇప్పటికే చాలా ప్రచారం చేసుకున్నామని వారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ”మ్యాడ్” టైటిల్ తిరిగి ఇచ్చేందుకు మల్టీ డైమన్షన్స్ సంస్థ అంగీకారం తెలిపింది.

ఈ సందర్భంగా మల్టీ డైమెన్షన్ రామ్మోహన్, వాసు, విజయ్ చౌదరి త్రిపురనేని లకు ”మ్యాడ్” చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ”మ్యాడ్” సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మ్యాడ్ చిత్రానికి సంగీతం – మోహిత్ రహ్మానియక్, ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ – రఘు మందాటి.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-శ్రీనివాస్ ఏలూరు