గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన విలక్షణ నటుడు హీరో ”సునీల్”!!

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన విలక్షణ నటుడు; హీరో సునీల్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రం చాలా తీవ్రంగా ముందుకు పోతుందని మన జీవితానికి కావలసిన ఆక్సిజన్ తీసుకోవడం కోసం మనం మొక్కలు నాటాలని. మన పెద్దవారు తాతలు అనేది వృక్షో రక్షిత రక్షితః అని కాబట్టి నా బాధ్యతగా ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది అని దీన్ని అందరూ బాధ్యత స్వీకరించి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్టిస్ట్ సురేఖ వాణి , కలర్ ఫోటో సినిమా చిత్ర బృందం అయిన డైరెక్టర్ సందీప్ రాజ్ , హీరో సుహాస్ , హీరోయిన్ చాందిని చౌదరి , మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాల భైరవ , కమెడియన్ వైవా హర్ష లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.