”ఆశిష్ గాంధీ”, ”చిత్ర శుక్ల” కాంబినేష‌న్‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్!!

నాట‌కం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల‌రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నుంది. రాజ్‌కుమార్ బాబీ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

నిర్మాత‌లు బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ… ఇదొక స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. సినిమా ప్రారంభ స‌న్నివేశం నుంచి ఆఖ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ క‌థ‌లోని మ‌లుపులు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తాయి. `నాట‌కం` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌నున్నారు. `రంగుల రాట్నం`, `సిల్లీ ఫెలోస్‌`, `మా అబ్బాయి` చిత్రాల ఫేమ్ చిత్ర శుక్ల ఇందులో క‌థానాయిక‌. ఇత‌ర తారాగ‌ణం వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. డిసెంబ‌ర్ మొద‌టి వారం నుంచి రాజ‌మండ్రి, కాకినాడ‌, నిడ‌ద‌వోలు, రంప‌చోడ‌వ‌రం, గుడిసె, రాజాన‌గ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతాం అని తెలిపారు.


ఈ చిత్రానికి క‌థ‌: బాబీ ఏడిద‌,

ర‌చ‌న‌: స‌ర‌దా శ్యా‌మ్‌,

డీఐ-విజువ‌ల్ ఎఫెక్ట్స్ : బ‌ండారు సాయి శ్రీ‌కాంత్‌,

కాస్టూమ్ డిజైన‌ర్ : రూప‌రేఖ గుత్తి,
ఛాయా గ్ర‌హ‌ణం: హ‌రిక్రిష్ణ (బెంగ‌ళూర్‌),

సంగీతం: పెద్ద‌ప‌ల్లి రోహిత్‌,

నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి,

ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ.