మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం మలయాళం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది ఆ చిత్రం యొక్క తెలుగు రీమేక్ రైట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి కోసం తీసుకున్న విషయం తెలిసిందే . అయితే మొదటి నుంచి అందరినీ వెంటాడుతున్న ప్రశ్న ఆ చిత్రాన్ని తెలుగులో దర్శకత్వం వహించే అవకాశం పొందే డైరెక్టర్ ఎవరా అని?.
చరణ్ లూసిఫర్ మూవీ రైట్స్ కొన్న మొదట్లో ఈ చిత్రాన్ని తెలుగులో సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడని ఆ తర్వాత చిరంజీవితో ఖైదీనెంబర్150 లాంటి హిట్ చిత్రాన్ని తీసిన వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు అని ఆ తర్వాత ప్రభాస్ తో సాహో లాంటి హై బడ్జెట్ చిత్రాన్ని స్టైలిష్ గా తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ కి మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని అనేక కథనాలు వెలువడ్డాయి, ఇలా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తిరిగి ఖైదీ నెంబర్ 150 మూవీని తెరకెక్కించిన దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల్లోకి వెళ్లిందని ఫిలింనగర్ వర్గాలలో చర్చ నడుస్తుంది.
వినాయక్ ఇప్పటికే రీమేక్ చిత్రాలు చక్కగా హ్యాండిల్ చేయగలడు అని ఖైదీనెంబర్150 రీమేక్ తో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా వినాయక్ మీద ఉన్న అపారమైన నమ్మకంతో వివి వినాయక్ కు లూసిఫర్ చిత్రం రీమేక్ చేసే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తాజా సమాచారం.