పవన్ కళ్యాణ్ ఫీలింగ్స్ డిట్టో తన ఫీలింగ్స్ అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde Pawan Kalyan Tweet

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త అమితాబ్ అభిమానులను మరియు ఎంతో మంది సినీ ప్రముఖులను ఆవేదనకు గురి చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమితాబ్ కు వీరాభిమాని అని అనేక సందర్భాల్లో తెలియజేశారు.అమితాబ్ కు కరోనా రావడం పవన్ కళ్యాణ్ ను ఎంతో ఆవేదనకు గురి చేసిందని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ లో పేర్కొన్నారు .

నాకు ఇప్పటికీ గుర్తుంది మీరు కూలి షూటింగ్లో గాయపడినప్పుడు మా కుటుంబసభ్యులు మొత్తం మీకోసం దేవుని ప్రారంభించాము. అన్ని వయసుల వారు మీకు అభిమానులే. మీ నటన మాత్రమే కాదు మీ సింప్లిసిటీ మీ పోరాడే తత్వం మీ డెడికేషన్ కు అందరూ ఇష్టపడతారు… అటువంటిది ఈరోజు మీకు మీ కుమారుడు అభిషేక్ కు కరోనా వచ్చిందని తెలిసి నేను ఎంతో బాధపడ్డాను.

ఆ దేవుడి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటాయని, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను – ఇట్లు మీ అభిమాని పవన్ కళ్యాణ్. అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ పై నటి పూజా హెగ్డే స్పందిస్తూ , అమితాబ్ విషయంలో తన ఫీలింగ్స్ కూడా డిట్టో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే ఉన్నాయ్ అని అమితాబ్ కుటుంబం త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసింది.