“ల‌వ్‌స్టోరి” కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసిన నాగ‌చైత‌న్య‌!

నాగ‌చైత‌న్య‌- సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఈ సినిమాను డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఫిదా సినిమా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న చిత్రం నాగ‌చైత‌న్య హీరోగా వ‌స్తున్న‌ ల‌వ్‌స్టోరి కావ‌డంతో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. ఈ సినిమా నుంచి మ‌రో స‌రికొత్త పోస్ట‌ర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది.

lovestory film

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి సాధాసీదాగా క‌నిపించినా.. ఈ కొత్త పోస్ట‌ర్లో మాత్రం ఎంతో ప్రేమ‌తో కౌగ‌లించుకుని రొమాంటిక్ యాంగిల్‌లో క‌నిపించారు. ఈ సినిమా శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్‌పై పుస్కూర్ రామ్మోహ‌న్‌, నారాయ‌ణ్ దాస్ కే నారంగ్ నిర్మించారు. అయితే ఓ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కొత్త పోస్ట‌ర్‌ను హీరో నాగ‌చైత‌న్య సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశాడు.