నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసే మూవీ ఏదో

సంక్రాంతి పండగ వస్తుంది అంటే సినీ అభిమానులకి స్పెషల్ గా ఉంటుంది. టాప్ హీరోల సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రిలీజ్ అవుతుండడంతో, ప్రతి తెలుగు ప్రేక్షకుడు కుటుంబంతో సహా సినిమాకి వెళ్తుంటాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లుఅర్జున్, కళ్యాణ్ రామ్, రజనీకాంత్ సినిమాలు పండుగ రేసులో ఉన్నాయి. సంక్రాంతికి ఇంకో నెలన్నర ఉంది కదా ఈలోపు మెమోస్తాం అంటూ బాలకృష్ణ, సాయి ధరమ్ తేజ్ లు రెడీ అవుతున్నారు.

ముందుగా నందమూరి నటసింహం బాలయ్యబాబు ‘రూలర్’ అంటూ డిసెంబర్ 20వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. కేయస్ రవికుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇదే డేట్ లో మారుతి అండ్ సాయిథరమ్ తేజ్ ల సినిమా ప్రతిరోజూ పండగే రావాల్సి ఉంది. బాలయ్బాబుతో పోటీ లేకుండా ఒకరోజు అటూ ఇటూగా ప్రతి రోజు పండగే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ అఫీషియల్ గా ఇప్పటికైతే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సినిమాలతో పాటే వెంకటేష్ నాగచైతన్యల వెంకీమామ కూడా క్రిస్మస్ ని టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. వెంకీ మామ రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ లేదు కానీ డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టిన రోజున కానీ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా కానీ ఈ సినిమాని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసే మూవీ ఏదోఈ మూడు స్ట్రెయిట్ సినిమాలతో పాటు కన్నడ నుంచి అతడే శ్రీమన్నారాయణ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయిదు భాషల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అయిదు భాషల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో కేజీఎఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాలుగు వారలు ఈ నాలుగు సినిమాలు డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కినవి కావడం, అన్ని సినిమాలపై మంచి అంచనాలు ఉండంతో ట్రేడ్ వర్గాల భారీ లెక్కలు వేసుకున్నాయి. మరి 2019కి ఈ నాలుగు సినిమాలు గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇస్తాయేమో చూడాలి.