అతడితో చాలా సరదాగా అనిపించిందన్న లావణ్య

సందీప్ కిషన్-లావణ్య త్రిపాఠి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. వారిద్దరు హాకీ ప్లేయర్స్‌గా ఇందులో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ బయటికొచ్చింది.

lavanya tripati

లావణ్య త్రిపాఠికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన లావణ్య.. సందీప్ కిషన్‌తో పనిచేయడం చాలా సరదాగా అనిపించిందంది. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో ఫుల్లుగా ఎంజయ్ చేశానని తెలిపింది. హాకీ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. డెన్నిస్ జీవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.